గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ క్రమంలో మూడో అంతస్తు నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని హౌసింగ్ సొసైటీ అయిన గౌర్ సిటీ 1 వద్ద ఉన్న మాల్లో అనేక దుకాణాలు, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, జిమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లోని మూడవ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వ్యక్తులు అద్దాలను పట్టుకుని చివరకు బయటకు దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.