»Mumbai High Court Shocks Kohli Will He Pay 50 Lakhs Will He Go To Jail
Kohli: కోహ్లీకి ముంబై హైకోర్టు షాక్, 50 లక్షలు చెల్లిస్తావా? జైల్‌కు వెళతావా?
మాజీ ప్రియురాలిపై దాడి కేసులో నటుడు ఆర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. గడువులోగా 50 లక్షలు చెల్లించకుంటే జైల్‌కు వెళ్లాల్సిందేనని హెచ్చరించింది.
Mumbai High Court shocks Kohli.. Will he pay 50 lakhs.. Will he go to jail..
Kohli: ప్రముఖ నటుడు ఆర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. 2018లో మాజీ ప్రియురాలు నీరూ రంధావా (Neeru Randhawa)పై జరిగిన దాడి కేసు సెటిల్మెంట్లో భాగంగా రూ.50 లక్షలు చెల్లించాలని స్పష్టంచేసింది. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కేసుకు సంబంధించిన ఉత్తర్వులను రీ కాల్ చేయాలని ఆర్మన్ కోహ్లీ కోరగా.. అతను 50 లక్షలు చెల్లిస్తాడా? లేదా జైలుకు వెళ్లాల్సి వస్తోందని కోర్టు హెచ్చరించింది.
2018లో నీరూ రంధావాపై అర్మాన్ కోహ్లి మెట్లపై నుంచి కిందకు తోసేశాడు. తలను నేలకేసి కొట్టాడని ఆమె ఆరోపించింది. తీవ్ర గాయాలయ్యాయని, 15 కుట్లు పడ్డాయని రాంధావా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దీంతో పోలీసులు కోహ్లీని అరెస్ట్ చేశారు. తరువాత వీరి మధ్య సెటిల్ మెంట్ జరిగింది. 50 లక్షలు నీరూ రంధావాకు చెల్లించాడు. మరో 50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. కోహ్లీ సోదరుడు రెండు చెక్కులు ఇవ్వగా అవీ బౌన్స్ అయ్యాయి. దీంతో రాంధావా మళ్లీ కోర్టును ఆశ్రయించారు. మిగతా డబ్బులు ఇస్తావా..? లేదంటే జైలుకు వెళతావో జూలై 18 లోపు చెప్పాలని కోర్టు ఆదేశించింది.