Smartphone: స్మార్ట్ ఫోన్ (Smartphone) వల్ల లాభాలు ఎన్నో.. నష్టాలు కూడా అన్నే.. అవును పిల్లలు మొబైల్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. ఎంతలా ఉంటే ఫోన్ ఇవ్వకుంటే మరాం చేసేంతలా తయారవుతున్నారు. ఇప్పుడు దాదాపు అందరికీ స్మార్ట్ ఫోన్స్ (Smartphone) ఉన్నాయి. అందులో నెట్ (internet) కూడా ఉంటుంది. ఇంకేముంది మెల్లిగా పిల్లలు తీసుకొని ఆడుతున్నారు. ఏదో ఒకసారి మారాం చేస్తేనో.. లేదంటే పని మీద బయటకు వెళితే మొబైల్స్ ఇవ్వడమే పాపం అయిపోతుంది. పేరంట్స్ ఉన్న లేకున్నా సరే.. తమకు మొబైల్ కావాలని మంకు పట్టు పడుతున్నారు.
గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని..
ఆరు.. ఆపై వయస్సు గల పిల్లలకు లోకజ్ఞానం తెలుస్తోంది. సో మొబైల్లో (mobile) యూ ట్యూబ్ (youtube) పెట్టుకొని చూడటమే కాదు.. ప్లే స్టోర్ ఓపెన్ చేయడం, కొన్ని గేమ్స్ డౌన్ లోడ్ చేసి మరీ ఆడుతున్నారు. అలా గంటలు గంటలు గేమ్స్ ఆడుతూ.. వాటికి అడిక్ట్ అవుతున్నారు. దీంతో స్కూల్‌కి వెళుతున్న వారిలో చదువు మీద కన్నా.. గేమ్స్ మీద ధ్యాస ఎక్కువగా ఉంటుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో స్టడీస్ మీద దృష్టి పెట్టరని.. వెనకబడతారని అంటున్నారు.
మతిస్థిమితం కోల్పోయిన బాలుడు
రాజస్థాన్‌లో (rajasthan) గల అల్వార్‌కు (alwar) చెందిన ఓ బాలుడు ఏకంగా మతిస్థిమితం కోల్పోయాడు. అవును.. అతను గేమ్స్ ఆడి, ఆడి పిచ్చి వాడు అయ్యాడు. మొబైల్లో (mobile) ఫ్రీ ఫైర్ అనే గేమ్ అడేవాడు అని పేరంట్స్ చెబుతున్నారు. ఇలా ఆడుతూ ఒకసారి ఓడిపోయాడట.. ఆ ఓటమిని తట్టుకోలేక పోయాడు. చివరికీ మతి కోల్పోయాడు. దీంతో అతనిని ప్రత్యేక పాఠశాలలో చేర్పించారు. నిపుణుల సాయంతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫిజికల్ ఆటలు ఆడిస్తున్నామని.. అతనికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని టీచర్ భవానీ శర్మ చెబుతున్నారు.
అడిక్ట్ కాకుండా చూడండి
సో.. మీ పిల్లలు కూడా మొబైల్స్‌కు (mobile) ఇంతలా ఆడిక్ట్ కాకుండా చూడండి. ఓ అరగంట.. మహా అయితే గంటపాటు మొబైల్ ఇవ్వండి. కానీ అదే పనిగా ఫోన్ చూడటం.. లేదంటే గేమ్స్ ఆడితే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. అలా జరగొద్దంటే ముందే మేల్కొవాలని మానసిక వైద్య నిపుణులు పేరంట్స్‌ను హెచ్చరిస్తున్నారు.