Kushi: సమంత, విజయ్ దేవర కొండ జంటగా నటిస్తున్న సినిమా ఖుషి (Kushi). ఈ మూవీ పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ అనే విషయం ఇప్పటికే అర్థమవుతోంది. లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో మంచి నేర్పరి అయిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నిన్ను కోరి, మజిలీతో హిట్ కొట్టిన ఆయన ఖుషితో (Kushi) మరో అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు.
మూవీ నుంచి ఓ అద్భుతమైన పాట విడుదల చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే పాట సూపర్ హిట్ గా నిలిచింది. పాటను హృదయం మళయాళం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచారు. పాటలో డైరెక్టర్ మణిరత్నం సినిమాలోని పేర్లన్నీ కలిపి వచ్చేలా పాటను రూపొందించారు.
మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. 25 సెకన్ల పాటు ఉన్న వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో సమంత, విజయ్ ఒకరినొకరు చేతులు పట్టుకొని నవ్వుకుంటున్నట్టు ఉంది. ఆ విజువల్‌ని హైలెట్ చేస్తూ బ్యాగ్రౌండ్ లో పాట ప్లే అయ్యింది. ఈ ప్రోమో లిరిక్స్ మొత్తం ఇంగ్లిష్‌లో ఉండటం విశేషం. యు ఆర్ మై సన్ షైన్.. యు ఆర్ మై మూన్ లైట్.. యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై.. కమ్ విత్ మి నవ్ అని పాట సాగిపోయింది. సిద్ శ్రీరామ్ ఈ పాట పాడాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.