ADB: జిల్లా కోర్టు ఆవరణలో క్లయింట్‌తో మాట్లాడుతున్న మహిళా న్యాయవాదిని దూషించిన ఘటనను నిరసిస్తూ, న్యాయవాదులు ధర్నా చేపట్టారు. మహిళా న్యాయవాదులను బెదిరించడం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ‘న్యాయవాదుల రక్షణ చట్టం’ తీసుకురావాలన్నారు.