NTR attacked a woman with acid for refusing to marry her in Nandigama district
సమాజంలో మహిళలపై ఇప్పటికీ దారుణాలు జరుగుతునే ఉన్నాయి. ఓ మహిళ పెళ్లికి ఒప్పుకోలేదని తనపై యాసిడ్ పోసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామ మండలంలో చోటుచేసుకుంది. ఐతవరానికి చెందిన ఓ మహిళకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. గత సంవత్సరం భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న మహిళ నెల్లూరు జిల్లా రాజేంద్రనగర్ కుక్కలగుంటకు చెందిన ఆటోడ్రైవర్ రాంసింగారం మాణిక్ సింగ్ తో పరిచయం అయింది. అయితే మాణిక్ కు కూడా వివాహం అయింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల్లూరు నుంచి అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వస్తుండేవాడు.
ఈ మధ్య మాణిక్ సింగ్ కు టీ.బీ వచ్చింది. విషయం తెలుసుకున్న మహిళ మాణిక్ సింగ్ ను దూరం పెట్టే ప్రయత్నం చేసింది. మాణిక్ సింగ్ తనను పెళ్లి చేసుకోవల్సిందిగా ఒత్తిడి పెట్టేవాడు. కానీ మహిళకు ఉన్న పిల్లల భవిష్యత్తు దృష్ట్యా.. మాణిక్ ఆరోగ్యం దృష్ట్యా ఆలోచించి వివాహం కుదరదని తేల్చి చెప్పింది. శనివారం రాత్రి మహిళ ఇంటికి వచ్చాడు మాణిక్ సింగ్. రాత్రి ఆమె ఇంట్లోనే నిద్ర పోయాడు. ఆదివారం ఉదయం లేచి మరోసారి తనను వివాహం గురించి అడిగాడు. మహిళ విముఖతను ప్రదర్శించడంతో మాణిక్ సింగ్ కోపంతో పథకం ప్రకారం ముందే తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ తో మహిళ వెనుకనుంచి పోశాడు. మహిళతో సహా కుమార్తె, కుమారుడి మీద పడటంతో వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితురాలిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ప్రైవేటు ఆసపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలు చికిత్సపొందుతోంది. 20 శాతం గాయాలు అయిన మహిళను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహాన్ రెడ్డి, మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పరామర్శించారు. నిందితుడు మాణిక్ సింగ్ (34)ను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఆదివారం మధ్యహ్నం మీడియా సమేవేశంలో మాట్లాడుతూ.. ఫేస్ బుక్ ద్వారా వీరికి పరిచయం అయినట్లు వెల్లడించారు. బాధితురాలికి ఐసీడీఎస్ ద్వారా నష్టపరిహారం అందేలా కలెక్టర్ తో మాట్లాడుతున్నట్లు తెలిపారు.