ATP: గుత్తిలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు పనులు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తెలిపారు. రూ.50 లక్షల నిధులతో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఇవాళ సాయంకాలం 5.30 గంటలకు ఈ ఉత్సవాలను కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారన్నారు.