సత్యసాయి: సోమందేపల్లిలోని జామియా మజీద్లో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో రంజాన్ మాసపు 24వ ఉపవాసాన్ని ప్రారంభించారు. సేహరీ అనంతరం మసీదులో ప్రత్యేక నమాజులు నిర్వహించి అల్లాహ్ ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసం ఆధ్యాత్మికతను పెంపొందించే పవిత్ర కాలమని, ఈ నెలలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దానధర్మాలు నిర్వహించడం ద్వారా అల్లాహ్ కృపను పొందవచ్చని తెలిపారు.