KMM: ఉపాధి కోసం వెళ్ళిన యువకుడు అద్దె గదిలో విగతజీవిగా ఉండడాన్ని స్థానికులు గమనించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా గొర్రెలపాడుకు చెందిన బానోత్ సాయి (25) మరిపెడలోని ఓ కంపెనీలో పనిచేస్తూ మిత్రుడితో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం గది తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి చూడగా సాయి ఉరివేసుకొని కనిపించాడు.