మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి ఏవైనా సందేహాలున్నా, సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూము నంబర్ 83747 72282ను సంప్రదించాలని కోరారు.