ADB: ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పథకాల అమలుపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.