HYD: రాజేంద్రనగర్ జోన్ పోలీసులు శాస్త్రిపురంలోని కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. నిందితులు అబ్దుల్ అలీమ్, దిల్దార్ అలీ రసాయనాలు, గమ్ పౌడర్ ఉపయోగించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 1800 కిలోల కల్తీ పేస్టు, ప్రమాదకర రసాయనాలు, ప్యాకింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.