WhatsApp New Update : గుడ్ న్యూస్..వాట్సాప్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్
వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది. కొత్త అప్డేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను తీసుకొచ్చింది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్(Whatsapp) మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్(Upate) తీసుకొచ్చింది. ఇంటర్ఫేస్ ఎక్స్పీరియన్స్ కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్(Feature) తెచ్చింది. తాజాగా ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ స్టిక్కర్, జిఫ్(GIF) పికర్లను రీడిజైన్ చేసింది. అవతార్(Avatar) సెక్షన్లో కొన్ని అప్డేట్స్తో పాటుగా చాట్‌లో జిఫ్(GIF), స్టిక్కర్ల(Stickers)ను ఈ అప్డేట్ సులభంగా యాక్సెస్ చేయనుంది. వాట్సాప్ యాప్ స్టోర్‌లో iOS వెర్షన్ 23.13.78ని ఇది రిలీజ్ చేస్తోంది.
కొత్త అప్డేట్(New Update) ప్రకారంగా గ్రిడ్‌లోని చాలా ఐటెమ్స్‌ను సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. జిఫ్(GIF), స్టిక్కర్(Sticker), అవతార్(Avatar) సెక్షన్లను యాక్సెస్ చేసేందుకు వాట్సాప్ బటన్లను కూడా మార్పు చేసింది. దీని వల్ల నావిగేషన్‌ను కూడా మార్చవచ్చు. అదేవిధంగా అవతార్ ప్యాక్‌ల కేటగిరీలను కూడా అప్డేట్ చేసింది.
రీక్రియేట్ చేసిన జిఫ్(GIF), స్టిక్కర్(Sticker) పికర్ లను వాట్సాప్ యూజర్లు ఇకపై సులభతరంగా సెర్చ్ చేయవచ్చు. దీని వల్ల పర్సనల్‌గా లేదా గ్రూప్ చాట్ల విషయంలో యూజర్ల(Users) సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా వాట్సాప్ iOS యూజర్లందరికి కొత్త అప్డేట్ మరింత హెల్ప్ కానుంది. తాజాగా అప్డేట్ చేసిన ఈ ఫీచర్ మరికొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు గ్యాలరీ నుంచి ఫోటోలను వాడి తమ కస్టమ్ స్టిక్కర్లను కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.