WNP: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అందించాలని శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించే జీవో 12ను సవరించాలని కోరుతూ ఏఎల్సీ రవికి వినతిపత్రం ఇచ్చారు. మరణించిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం బోర్డు నుంచే నేరుగా అందించాలన్నారు.