KMR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పోలీస్ క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు ‘తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్’ నిర్వహించారు.