»Australia Indian Student Murder Case Buried Alive Court Sentence
Australia: ‘గర్ల్‌ఫ్రెండ్‌ను సజీవంగా పాతిపెట్టారు’..ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిని హత్య
హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2021లో అడిలైడ్‌కు చెందిన తారిక్‌జోత్ సింగ్ (22) తన మాజీ ప్రియురాలు జాస్మిన్ కౌర్ (21)ని హత్య చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఈ నేరాన్ని అంగీకరించాడు.
Australia: 2021లో ఆస్ట్రేలియాలో జరిగిన భారతీయ విద్యార్థిని హత్యకు సంబంధించిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో చెప్పిన విషయాల ప్రకారం.. విద్యార్థినితో మాజీ ప్రియుడు మొదట పలు అఘాయిత్యాలకు పాల్పడి ఆ తర్వాత సజీవ సమాధి చేశాడు. హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2021లో అడిలైడ్‌కు చెందిన తారిక్‌జోత్ సింగ్ (22) తన మాజీ ప్రియురాలు జాస్మిన్ కౌర్ (21)ని హత్య చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఈ నేరాన్ని అంగీకరించాడు. బుధవారం దక్షిణ ఆస్ట్రేలియాలోని కోర్టులో కేసుకు సంబంధించిన వివరాలను చెప్పాడు.
జాస్మిన్ కౌర్ ఆస్ట్రేలియాలో నర్సింగ్ విద్యార్థిని 2021లో తారిక్‌జోత్ సింగ్ ఆమెను చాలా కాలం పాటు అనుసరించాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేశాడు. తారిక్‌జోత్ తన కూతురిని ప్రేమిస్తున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, అయితే ఆమె నిరాకరించడంతో, అతను ఈ విధంగా పగ తీర్చుకున్నాడని జాస్మిన్ తల్లి వాంగ్మూలం ఇచ్చింది. జాస్మిన్ను ఆ వ్యక్తి ఆఫీసు నుంచి కిడ్నాప్ చేసినట్లు కోర్టులో తేలిన విషయాలు. అనంతరం రహస్య ప్రదేశంలో ఉంచి టేప్‌తో కట్టేశారు. సీసీటీవీ ఫుటేజీలో తారిక్‌జోత్ సింగ్ కిడ్నాప్ చేయడానికి ముందు టేపులు, తాళ్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు కనిపించింది. నిందితుడు ముందుగా తన మాజీ ప్రియురాలిని చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత ఆమె గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. అది జరగకపోవడంతో నిందితులు బాధితురాలి నోటికి టేప్ పెట్టి సజీవంగా భూమిలో పాతిపెట్టారు. కాలిన గాయాల వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. తాను విడిపోవడాన్ని తట్టుకోలేకపోయానని, దీని వల్ల చాలా కలత చెందానని, తనను తాను నియంత్రించుకోలేకపోయానని దోషి ఒప్పుకున్నాడు. దక్షిణ ఆస్ట్రేలియా కోర్టు తారిక్‌జోత్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. ఇది మొదటి 20 సంవత్సరాల పాటు పెరోల్ లేకుండానే ఉంటుంది.