Bharat Jain, the world's richest beggar, is our Indian
అప్పుడప్పుడు బిచ్చగాళ్ల గురించి కొన్ని కథనాలు చదువుతాము. అవి చాలా ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బిచ్చాగాళ్లలో కూడా సంపన్నుల జాబితా గురించి వినే ఉంటారు. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడైన బిచ్చగాడు(RichBeggar) ఇండియాలోనే ఉన్నాడు. మహారాష్ట్ర థానేకి చెందిన భరత్ జైన్(Bharath Jain) గురించి ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. భిక్షాటన వృత్తిగా మార్చుకుని కొందరు డబ్బు సంపాదిస్తుంటారని, ఇది ఒక ముఠాగా ఏర్పడింది అన్న విషయాలు చాలా సార్లు విన్నాము. అలాగే ఈ రిచ్ బెగ్గర్ భరత్ జైన్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
మహారాష్ట్ర థానేకి చెందిన భరత్ జైన్ ఆస్తుల విలువ సుమారు రూ.7.5 కోట్లట. అతని నెలసరి సంపాదన రూ.60,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుందంట. ఇతని పనే బాగుంది అనుకుంటున్నారు కదా.. ఇంకా ఈయన ఆస్తుల చిట్టా ఉంది. ముంబయిలో అతనికి రెండు ప్లాట్లు ఉన్నాయట. అవి రూ.1.4 కోట్ల విలువ చేస్తాయట. థానేలోనే రెండు షాపులు ఉన్నాయి. అవి రెంటుకు ఇవ్వడం వలన నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తాయట. అంతే కాదండోయ్ కొన్ని షాపుల్లో పెట్టుబడులు కూడా పెట్టాడట.
భరత్ చిన్నతనంలో కటుంబ ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేక చదువుకోలేకపోయాడట. అతనిలా తన బిడ్డలు కాకూడదని పిల్లల్ని బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేసాడట. ఇక భరత్ కుటుంబంలోని ఇతర సభ్యులు స్టేషనరీ స్టోర్ నిర్వహిస్తున్నారట. భరత్ జైన్ ఎక్కువగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ లో ఎక్కువగా భిక్షాటన చేస్తాడట. ముంబైలో ఉంటున్న భరత్ ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడు.