చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ కొత్తదది కాకపోయినా.. వచ్చే సంక్రాంతి మాత్రం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ జరగబోతోంది. పైగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి, ఓకే ప్రొడక్షన్ నుంచి వస్తూ ఉండడం.. మూవీ లవర్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న రిలీజ్ అవుతుండగా.. మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రాబోతోంది. ఇద్దరి మధ్య ఒకరోజు గ్యాప్ మాత్రమే ఉంది. అందుకే ఓపెనింగ్స్ విషయంలో ఎవరిది పై చేయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎవరికి ఎక్కువ థియేటర్లు ఇస్తే.. వారిదే హవా అని అంటున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్స్ వేగం పెంచారు వీరయ్య, వీరసింహా. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ముందుగా జనవరి 4న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి 6న ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే అదే రోజు వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈవెంట్లోనే ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి.. వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ ట్రైలర్స్ కట్ చేసే పనిలో ఉన్నట్టు టాక్. ఈ లోపు మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాల ట్రైలర్స్ అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తారా.. లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనే విడుదల చేస్తారా.. అనేది తెలియాల్సి ఉంది.