ఖమ్మం సభ(Khammam Sabha)కు BRS ఆటంకాలు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి (Renuka Chaudhary) ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే భయంతో మా సభను ప్రభుత్వం అడ్డుకుంటోంది. రోడ్లపై బారికేడ్లు పెడితే భయపడతామా? మా జాతకాల్లో భయాల్లేవు. ఎవడబ్బ సొమ్మని పెడుతున్నారు? పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది?’ అని ఫైర్ అయ్యారు. ఇవాల్టి సభ ట్రైలరేనని(Trilarar),ముందు ముందు సినిమా చూపిస్తామని రేణుకా చౌదరి అన్నారు.కాంగ్రెస్ జనగర్జన సభ (Janagarjan Sabha) నేడు ఖమ్మంలో జరగనున్న సభకు ఓవైపు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) మీడియ సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలను అధికారులు అడ్డుకుంటున్నారని కంటతడి పెట్టారు.
ఉమ్మడి జిల్లా సరిహద్దులలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు (Vehicle Inspectors) శనివారం అర్ధరాత్రి నుంచే వాహనాలను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనగర్జన సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి వెల్లడించారు. ఈ సందర్భంగా తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ట్రాక్టర్లు(Tractors), బైక్ లు, ఆటోలు, కార్లు, డీసీఎం వ్యానులు.. ఇలా దాదాపు 1700 ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసుకున్నారని వివరించారు. అయితే, ప్రభుత్వం మాత్రం జనాలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతోందని పొంగులేటి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ (ఎంవీఐ) లను పిలిపించి అర్ధరాత్రి నుంచే వాహనాల తనిఖీ నిర్వహిస్తోందని చెప్పారు.