NLG: మునుగోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లతో కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో రూ. 1.75 కోట్ల వ్యయంతో చెలిమెడ నుండి బొత్తలగడ్డ వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించారు.