»The Movie Will Release In Three Weeks Still The Shooting Is Not Completed Pawan Fans Are Worried
Bro movie: మూడు వారాల్లో సినిమా విడుదల.. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. ఆందోళనలో పవన్ ఫ్యాన్స్
బ్రో సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హీరో సాయి తేజ్, హీరోయిన్ కేతిక శర్మల మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరపుకుంటోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సినిమా విడుదల తేదీలో ఏదైన మార్పులు చేస్తారా అని భయాందోళనలో ఉన్నారు.
Pawan fans are worried.. Still the shooting is not completed..
Bro movie:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan), మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇద్దరు కలసి మొదటి సారి వెండితెరపై కనిపించడానికి రంగం సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ భాషాల్లో ఎన్నో సూపర్ డూపర్ సినిమాల్లో విలక్షణ నటుడిగా మనకు పరిచయం ఉన్న సముద్ర ఖని (samuthra khani) వీరు నటించే బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసీ బ్రో (Bro) సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన బ్రో టీజర్ తో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా చాలా హ్యాండ్సమ్ గా చూపించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూసినట్లు ఉందని తెగ మురిసిపోతున్నారు. ఇదిలా ఉంటే బ్రో చిత్రం ఈ నెల అంటే జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అవుతుంది.
ఈ సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ పవన్ ఫ్యాన్స్ కు ఊపిరి సలపనియ్యడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే బ్రో సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండగా.. హీరో సాయి తేజ్, హీరోయిన్ కేతిక శర్మల(Kethika Sharma) మధ్య వచ్చే ఓ సాంగ్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతం ఫారెన్ లో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. తాజాగా సెట్స్ నుంచి ఫోటోలు విడుదల అవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన పడుతున్నారు.
ఒక వైపు సాంగ్ షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ జులై 3న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా టీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా, తమన్(Thaman) మ్యూజిక్ డైెరెక్టర్ గా వ్యవహిరిస్తున్నారు.