కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
kidney mafia: అవసరం కోసం కొందరు తమ కిడ్నీలను (kidney) కూడా అమ్ముకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కిడ్నీ అమ్మేందుకు ముందుకు వస్తే.. కిడ్నీ మాఫియా వారిని మోసం చేస్తోంది. చెప్పిన మొత్తం కన్నా తక్కువ నగదు ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయిన్నారు. ఏలూరు (elure) జిల్లాలో ఓ మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనను ఒకతను మోసం చేశాడని వాపోయింది.
ఏలూరుకు చెందిన బూసి అనురాధను (anuradha) కిడ్నీ రాకెట్ మాఫియా కాంటాక్ట్ చేసింది. కిడ్నీకి ఏడు లక్షలు ఇస్తామని చెప్పింది. సర్జరీ జరిగిన తర్వాత నాలుగు లక్షలు ఇచ్చింది. మిగతా అమౌంట్ అప్పుడు, ఇప్పుడు అని వాయిదాలు పెట్టింది. మరో రూ.3 లక్షలను బ్రోకర్ ప్రసాద్ ఇవ్వలేదు సరి కదా పారిపోయాడు. అతను కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఏలూరు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపరేషన్ చేసిన ఆస్పత్రి, మధ్యవర్తుల వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఆన్ లైన్లో ప్రకటనలు, డబ్బు ఆశ చూపించే కిడ్నీ ముఠాల మాటలు నమ్మొద్దని పోలీసులు కోరుతున్నారు. నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.