»A Case Has Been Registered Against Star Hero Vijay The Reason Is
Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు..కారణం అదే
తమిళ హీరో దళపతి విజయ్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్‌లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay)పై కేసు నమోదైంది. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం లియో (Lio Movie)లోని ‘నారెడీ’ సాంగ్(Naa ready Song)ను మేకర్స్ విడుదల చేశారు. పాట విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఆ లిరికల్ సాంగ్(Lyrical Song)లో విజయ్ చాలా చోట్ల సిగరెట్ తాగుతూ నటించాడు. దీంతో ఓ వ్యక్తి పాటలో విజయ్ పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించేలా కనిపించాడంటూ, నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశాడు.
ఆ పాటలో మద్యం, పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు(Police) తెలిపారు. ఈ మధ్యనే విజయ్(Vijay) తమిళనాడులో అత్యధిక మార్కులు సాధించిన 10, 12 తరగతుల విద్యార్థులను కలిసి వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. ఆ టైంలో డబ్బులు తీసుకోకుండా ఓటు వేసేలా తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని సందేశం ఇచ్చాడు. అటువంటి విజయ్ ఇలా సిగరెట్ తాగుతూ నటించడం బాలేదని కేసు నమోదు చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు.
కాగా లియో సినిమా (Leo Movie)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మాస్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ పెరిగింది. లియో సినిమా తెలుగు హక్కుల కోసం ఏకంగా ఇరవై కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందని సమాచారం. లియో మూవీని లోకేశ్ కనకరాజ్(Director Lokesh Kanakaraj) దర్శకత్వం వహించడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.