»Popular 70s Lavani Artist Marathi Shantabai Londhe Spotted Struggle Living Life
Lavani Artist Condition: రోడ్డున పడ్డ ప్రముఖ డ్యాన్సర్.. ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, సంరక్షక మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా శాంతాబాయికి సహాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిద్ధరాం సలీమత్ షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమానికి వెళ్లి శాంతాబాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Lavani Artist Condition: జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. కాలం ఎవరికీ ఒకేలా ఉండదు. ప్రముఖ లావణి డ్యాన్సర్ శాంతాబాయి కోపర్గావ్కర్ కు సంబంధించి విచారకరమైన వార్త తెరపైకి వచ్చింది. ఆమె ప్రస్తుత పరిస్థితిని చూసిన కళాభిమానులంతా బాధతో ఆపన్నహస్తం అందిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, సంరక్షక మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా శాంతాబాయికి సహాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిద్ధరాం సలీమత్ షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమానికి వెళ్లి శాంతాబాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆశిష్ యెరేకర్ పాల్గొన్నారు. శాంతాబాయికి ప్రభుత్వం తరపున పూర్తి గౌరవం ఇస్తూనే ఆమెకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు శాంతాబాయికి శాశ్వత ఏర్పాట్లు చేసే వరకు షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమంలో బస, భోజన ఏర్పాట్లు చేశారు మాజీ ఎమ్మెల్యే స్నేహలత కోల్హే. వారికి పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తరపున సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ హామీ ఇచ్చారు.
ఈ దురదృష్టకర వార్త గురించి ఎవరు విన్నా, కళాకారిణికి సహాయం చేయడానికి చేయి అందిస్తున్నారు. సంజయ్‌గాంధీ నిరాధార్ పథకం కింద శాంతాబాయికి ప్రతి నెల రూ.వెయ్యి వస్తుందని కోపర్గావ్ తహసీల్దార్లు తెలిపారు. అదే సమయంలో రేషన్‌కార్డును మళ్లీ ఆన్లైన్ చేయడం ద్వారా అంత్యోదయ యోజనతో పాటు కేంద్రం నుంచి కళాకారులకు సౌకర్యాలు, పథకాలు అందజేసే ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా సరిదిద్దనున్నారు. శాంతాబాయికి 70 ఏళ్లు, 4 దశాబ్దాలుగా ఆమె తన కళతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.