తాను సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాననే వార్తలపై రష్మిక మందన్న స్పందించింది. ‘అందరూ అనుకుంటున్నట్లు నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. నేనేమీ హీరోని కాదు కదా.. అంత భారీ మొత్తంలో తీసుకోవడానికి’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఆ వార్తలు నిజమైతే బాగుండేదని చమత్కరించారు. డబ్బు కంటే మంచి పాత్రలకే తాను విలువిస్తానని రష్మిక స్పష్టం చేశారు.