లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను ప్రతిష్టాత్మక ‘పద్మపాణి’ పురస్కారం వరించింది. మహారాష్ట్రలో జరగనున్న అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(AIFF)లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. జనవరి 28న జరిగే వేడుకలో జ్ఞాపికతో పాటు రూ.2 లక్షల నగదును అందజేయనున్నారు. వేల పాటలతో భారతీయ సంగీతానికి ఆయన చేసిన సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది.