తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఇప్పటికే మాస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన తరువాత మరోసారి ఈ క్రేజీ కాంబోలో సెట్ అవ్వడం, షూటింగ్ కొనసాగుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రాత్రి 12 గంటల సమయంలో ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇప్పుడు ఈ లుక్ విజయ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకుని విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. విజయ్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ఇక విజయ్ పక్కన తోడేలు కూడా కోపంగా చూస్తూ ఉంది. ఫుల్ మాస్ మూవీ అని ఒక ఫస్ట్ లుక్ తోనే అర్థమైపోతుంది. మొత్తానికి ఈ పోస్టర్‌తో ‘లియో’ మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ‘లియో’ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్గా చేస్తోంది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక, ఈ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.