PLD;: మాచర్ల పట్టణంలోని 13వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ల పనులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రైన్ల నిర్మాణ పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో ఆయన వెంట పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.