KDP: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ నుంచి బద్వేలుకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం చైతన్య నిరంజన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి విజయవాడలో( సర్వీస్ నెంబర్ 95388) బస్సు 8 గంటలకు బయలుదేరి పామూరు, బద్వేల్ మీదుగా కడపకు వెళుతుందని చెప్పారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.