GNTR: తెనాలిలోని చినరావురు ప్రభుత్వ ఐటీఐలో రేపు నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో ఐటీఐ పాసైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పిస్తామని ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి గల అర్హులు తమ సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డుతో నేరుగా హాజరుకాగాలన్నారు.