VZM: బంగ్లాదేశ్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పరామర్శించారు. శనివారం బాధిత కుటుంబాల నివాసాలకు వెళ్లి వారిని ఓదార్చారు. మత్స్యకారుల్లో ఒకరి భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టినప్పటి నుండి ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శిశువుకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు