Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి విభిన్న కథనాలు ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టుకు పైకి ఎదుగుతున్నాడు. తాజాగా ఆయన కొత్త సినిమాకి సంబంధించి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ సినిమాకు లంకాల రత్న అని పేరు పెట్టారు. టైటిల్ మాస్ వైబ్స్ ఇస్తుంది. ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండటం విశేషం. విశ్వక్ సేన్ లంకల రత్నలో ఫుల్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నాడు. లుక్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఇంత మాస్ గా ఆయనను చూడటం ఇదే మొదటి సారి. లుక్, హెయిర్ స్టైల్ మొత్తం మార్చేశాడు. చిన్న జుట్టు, గడ్డంతో కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ రాజమహేంద్రవరంలో శరవేగంగా జరుగుతోంది. ఇది రాజకీయ టోన్లతో కూడిన యాక్షన్-డ్రామా చిత్రం అని తెలుస్తోంది.
సినిమాలో నటి అంజలి రత్నమాలగా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఫార్చూన్ ఫోర్ సినిమాతోపాటు సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ మాస్, క్లాస్‌లకు సమానంగా అందించే వైవిధ్యమైన కంటెంట్‌ను తీసుకురావడంలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు.