JGL: ధర్మపురి మండలంలో ఓ యువకుడు గంజాయితో వెళ్తున్నాడన్న సమాచారం మేరకు కమలాపూర్ రోడ్డులో తనిఖీలు నిర్వహించామని ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు. తనిఖీల్లో ధర్మారం మండలానికి చెందిన కూతాడి దుర్గాప్రసాద్ వద్ద 129 గ్రాముల గంజాయి లభ్యమైందన్నారు. విచారణలో మంచిర్యాలకు చెందిన కండ్రకొండ వెంకటేష్ నుంచి గంజాయి తీసుకున్నట్లు వెల్లడించాడని తెలిపారు.