MDK: సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారందరూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. పండుగ సమయానికి ప్రజలు స్వగ్రామాలకు ప్రయాణిస్తారని, దోపిడీ దొంగలు ఈ అవకాశం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకూడదని, లాకర్లో భద్రపరచాలని అన్నారు.