MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన తేజావత్ సునీత వెంకన్న దంపతులకు మండలంలోని పత్తేపురం శివారులో NLM గొర్రెల ఫామ్ ఉంది. సదరు గొర్రెలను రోజువారి లాగే మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ సుమారు రూ. 20వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితురాలు తెలిపారు.