MNCL: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని SCR సికింద్రాబాద్ డివిజన్ అధికారులు ఈనెల 11,12 తేదీల్లో హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు ( 07473/07474) నడిపించడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్పెషల్ రైళ్లతో 2 రోజుల పాటు మరో రెండు ట్రిప్పులు నడపనున్నారు. రైల్వే అధికారుల తాజా నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.