KNR: కరీంనగర్ పట్టణంలోని దివ్య క్షేత్రం శ్రీ మహాశక్తి ఆలయంలో శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. భారత దేశ సాంస్కృతిక చిహ్నం సోమనాథ్ మందిరంపై 1000 ఏళ్ల క్రితం జరిగిన అనాగరిక దండయాత్ర విచారక ఘటనను గుర్తు చేసుకుంటూ దేశమంతా శివాలయాల్లో అభిషేకాలు చేయాలని అన్నారు.