CTR: జిల్లా కలెక్టరేట్లో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకానునట్టు పేర్కొన్నారు.