నిజామాబాద్ నగరంలోని రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగంగా చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, మ్యాన్ హోల్స్ పనులను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.