KDP: గండికోట ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మలమడుగు నుంచి 20, కడప నుంచి 8, ప్రొద్దుటూరు నుంచి 8, మైదుకూరు నుంచి 3 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జనవరి 11న ఉదయం 10 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఉత్సవాలకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.