GNTR: సీపీఐ శతవార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభ జనవరి 18న ఖమ్మంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి తెలిపారు. ఈ సభకు గుంటూరు జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలివెళ్తారని చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ, రాజ్యాంగ విలువల రక్షణ కోసం సీపీఐ ఉద్యమాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.