VKB: గ్రామాభివృద్ధికి గ్రామసభలే పునాది అని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రణాళికలు రూపొందించుకోవాలని ఇప్పాయిపల్లి సర్పంచ్ మల్లేష్ పిలుపునిచ్చారు. కుల్కచర్ల మండలంలోని ఇప్పాయిపల్లిలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, వీధిదీపాల ఏర్పాటుతో పాటు తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.