VZM: ఒక జిల్లా-ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి మామిడి తాండ్రను ఎంపిక చేసినట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రకటించారు. విస్తరణ, అభివృద్దికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎల్కోట మండలం భీమాలి వద్ద తయారయ్యే మామిడి తాండ్ర ఇప్పటికే ఎంతో ప్రసిద్ది పొందిందన్నారు.