SRCL: క్రీడలు స్నేహభావం.. శారీరక దారుడ్యానికి దోహద పడుతాయని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్లో వార్షిక స్పోర్ట్స్ మీట్ పోటీలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. 100, 200, 400, 800, 5 కిలోమీటర్ల పరుగు పందెం, క్రికెట్, వాలీబాల్, షెటిల్, క్యారం, చెస్ పోటీలు నిర్వహించారు.