డీఎల్ రవీంద్రారెడ్డి… ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. త్వరలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఆయన టీడీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ ఆయనకు ఎంపీ సీటు కూడా ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీని వదిలి… ప్రతిపక్ష పార్టీలోకి ఎవరూ రావాలని అనుకోరు. కానీ.. డీఎల్ మాత్రం… సొంత పార్టీ పై విమర్శలు చేస్తూ… పక్క పార్టీలో తాను చేరడం ఖాయం అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుందని తాజాగా ప్రకటనలిస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని రవీంద్రా రెడ్డి జోస్యం చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రవీంద్ర రెడ్డి అంటున్నారు.
గత కొద్దిరోజులగా డీఎల్… జగన్ ని, వైసీపీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీలో ఉన్నందుకు నాకే అసహ్యంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని విమర్శించారు.
“ఎన్నికలకు ముందు కొందరు ముఖ్యమైన రెడ్లు సమావేశం అయ్యారు. అన్నా నాకుంది ఇద్దరూ కూతుర్లే కదా, ఆల్రెడీ మా నాన్న ద్వారా 30, 40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి… నేను అవినీతికి పాల్పడకుండా మా నాన్న కంటే మంచిపేరు తెచ్చుకుంటాను అని జగన్ చెప్పినట్టు ఆ ముఖ్యమైన రెడ్లు కూడా చెప్పారు. ఎన్నికల తర్వాత రిజల్ట్ రాకముందు నాతో కూడా అదే చెప్పాడు. నేను అవినీతి చేయను అన్నా… చాలా మంచి పరిపాలన అందిస్తాను అని అన్నాడు. కానీ పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి అవినీతే. ఇసుకలోనూ అవినీతికి పాల్పడ్డారు. మాలాంటివాళ్ల సలహాలు తీసుకుంటే కదా పరిపాలన మంచిగా సాగేది… అలా కాకుండా డబ్బు కోసమే పరిపాలన చేస్తుంటే ఎలా…? అంటూ విమర్శించారు.