రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో టికెట్ల మీద నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. టికెట్ల కోసం ఎవరి వేటలో వారు ఉన్నారు. టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కార్యకర్తల వేటలో పడ్డారు నేతలంతా. ఎవరికీ వారు బలనిరూపణ చేసుకుంటున్నారు. తామేంటో హైకమాండ్ కు చూపించుకోవాలని తాపత్రపడుతున్నారు.ఓయూ జే.ఏ.సీ చైర్మన్(OU JAC Chairman), బిఆర్ఎస్ వి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వామి యాదవ్(Swami Yadav) రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. దీని కోసం తన పుట్టినరోజు వేడుకలను యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఘనంగా జరుపుకున్నారు.
సొంత నియోజకవర్గంలో వేల సంఖ్యలో అభిమానులు, బీఆర్ఎస్ (BRS) నేతలు, విద్యార్ధి నాయకులను ఒక్క దగ్గరకు చేర్చాడు. తన పుట్టిరోజు ఓ హోటల్ లో గ్రాండ్ గా చేశాడు. గత ఎన్నికల్లో టికెట్టు ఆశించి బంగపడ్డ నేతలంతా మళ్లీ తెరపైకి వస్తున్నారు. అధిష్టానం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని హైకమాండ్ (High Command)పై ఒత్తిడి తీసుకువస్తున్నారట. పార్టీలో సముచిత స్థానం ఉన్న నేతలంతా పార్టీలో తమ ఉనికి కోల్పోకుండా చూసుకుంటున్నారు. పార్టీలో తమ స్థానాన్ని, జనాల్లో తన పేరును నిలుపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ కూడా తనదేనని అత్యంత సన్నిహితులతోనూ స్వామి యాదవ్ చర్చించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియా శీలకంగా స్వామి వ్యవహారించారు. ఓయూ విద్యార్థి విభాగంలో కీలకంగా పని చేశారు. బీఆర్ఎస్ కోటరీలో కీలకంగా ఉన్న నాయకులకు స్వామి యాదవ్ సన్నిహితుడు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ మార్పుల్లో స్వామి యాదవ్ ముందున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వామి యాదవ్ కే టికెట్ వస్తుందని తెలంగాణ భవన్ (Telangana Bhavan)నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.