NZB: కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్ ఎండీగా ఉన్న ఆయన, మోసపూరిత నెట్వర్క్ ద్వారా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం మేరకు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.