కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారని పేర్కొంటూ ఓపెన్ అయింది నిత్యామీనన్.
మలయాళీ (Malayali) ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి నిత్యమీనన్(Nithya Menon). తన సహజ నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళీ అన్న వ్యత్యాసం లేకుండా అన్ని భాష చిత్రాలలో నిత్యమీనన్ నటిస్తున్నారు. ఇక ఈమె చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు జోడిగా నటించారు. నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) పై స్పందించింది. ఇక ఈ అమ్మడు పెళ్లి గురించి కూడా చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తల పై కూడా నిత్యామీనన్ స్పందించింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. కామాంధులు అన్నిరంగాల్లోనూ ఉంటారు. టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని నిత్య అన్నారు . కానీ తమిళం(Tamil)లో మాత్రం ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు అని చెప్పుకొచ్చింది. అసభ్యంగా తాకుతూ పిచ్చిగా ప్రవర్తించాడాని వాపోయింది. నిత్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నన్ను అందరూ కూడా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఒక తమిళ హీరో మాత్రం పదే పదే నన్ను అసభ్యంగా తాకుతూ ఇబ్బందిపెట్టేవాడు. అతని చేష్టల కారణంగా ఆ సినిమాను పూర్తిచేయడం కష్టమైపోయింది” అని చెప్పుకొచ్చింది.