MBNR: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని ఆయన తెలిపారు.