SRCL: కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మారుపాక నర్సయ్య 45 అనే వ్యక్తి, ఆదివారం కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. కువైట్లో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సంవత్సరం క్రితం స్వగ్రామానికి వచ్చి తిరిగి కువైట్ వెళ్ళాడు. తాను ఉన్న రూములో చాతిలో నొప్పి రావడంతో తోటి స్నేహితులు ఆసుత్రికి తరలిస్తున్న సమయంలోనే మృతి చెందాడు.